చార్మినార్ కి బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీ - MicTv.in - Telugu News
mictv telugu

చార్మినార్ కి బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీ

November 21, 2022

హైదరాబాద్ లోని ప్రముఖ చారిత్రక కట్టడమైన చార్మినార్ వద్ద బాంబు పెట్టామని పోలీసులకు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. చుట్టుపక్కల దుకాణాలు, హోటళ్లులో బాంబ్ స్క్వాడ్ పరిశీలించింది. ఎక్కడా బాంబు దొరక్కపోవడంతో ఫేక కాల్ గా నిర్ధారించారు.

దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆకతాయిల కాల్ అయ్యుంటుందని భావిస్తున్నారు. గతంలో కూడా చార్మినార్ కి ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలుపుతున్నారు. ఇటీవల సంతోష్ నగర్ లోని ఐఎస్ సదన్ వద్ద కూడా బాంబు పెట్టామని ఫోన్ వచ్చింది. పోలీసులు ఫేక్ కాల్ చేసిన ఆ వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.