కాజోల్ కు బెదిరింపు..  - MicTv.in - Telugu News
mictv telugu

కాజోల్ కు బెదిరింపు.. 

September 2, 2017

బాలీవుడ్ నటి కాజోల్ జంట పండుగ తతంగం వివాదస్పదంగా మారింది. ఆమె ట్విటర్ లో చేసిన పోస్టు పై గొడవ రేగింది. ‘గణపతి, ఈద్ పండుగలను ఇద్దరు దేవుళ్లు కలసి జరుపుకున్నారు. మరి మనం ఎందుకు అలా జరుపుకోకుడదు? దేవుని ఆశీస్సులు అందరికి ఉండాలి’ అని కాజోల్  ట్వీట్ చేసింది. దీనిపై ఇమ్రాన్ అనే నెటిజన్ గరమమయ్యాడు.

‘మీకు ఇదే నా చివరి హెచ్చరిక. వినకుంటే తర్వాత జరగబోయే తీవ్ర పరిణామాలకి మీరే బాధ్యత వహించాలి’ అని కామెంట్ చేశాడు. దీనిపై కాజోల్ స్పందించలేదు కానీ కొందరు నెటిజన్లు ఆ వ్యక్తిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాజోల్ చెప్పిన దాంట్లో  ఏం తప్పుందని సదురు నెటిజన్ ను విమర్శిస్తున్నారు.