మైసమ్మ మూడో ఎపిసోడ్ వచ్చేసింది. గత ఎపిసోడ్లో మనవరాలికి పెళ్లి సంబంధం
తీసుకువచ్చిన కనకవ్వ మనవరాలిని పెళ్లికి ఒప్పించాలని చూసి విఫలం అవుతుంది. ఈ ఎపిసోడ్లో మనవరాలిని చిడాయించిన వాడి దుమ్ము దులుపుతుంది కనకవ్వ. ‘నా మనవరాలికి జోలికే వస్తావా? నీకు అక్కాచెళ్లెండ్లు లేరా?’ అని అతన్ని చెడుగుడు ఆడుకుంటుంది. చైతన్య కూడా అతని గల్లా పట్టుకుని తిడతాడు. ధమ్కీ ఇస్తాడు. అతను మాత్రం చాలా కూల్‌గా వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ‘మీ అక్కను నేను పదేళ్లుగా వన్ సైడ్ లవ్ చేస్తున్నాను. మీ అక్క కోసమే ఈ ఆఫీస్‌లో జాయిన్ అయ్యాను. ఇన్ని రోజులు చెల్లె, తమ్ముడి బాధ్యతలు ఉండె. వాళ్ల బాధ్యత తీరడంతో మీ అక్కను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా’ అని చెప్తాడు సంజీవ్. దీంతో చైతన్య కూల్ అయి కనకవ్వకు చెప్తాడు. ఇంట్లో వారి ముగ్గరి మధ్య అతని గురించి చర్చ సాగుతుంది.
అంతకుముందు మైసమ్మ, సంజీవ్‌లు కలిసి ఆఫీస్ ఆవరణలో మాట్లాడుకుంటారు. తన తమ్ముడి బాధ్యత తన మీద ఉందని చెబుతుంది. పెళ్లి అయ్యాక ఇద్దరం కలిసి మీ తమ్ముడి బాధ్యతను కలిసి తీసుకుందాం అని చెబుతాడు. మరి మైసమ్మ అతని ప్రపోజల్‌ను ఒప్పకుందా? ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? తన పెళ్లికి కనకవ్వకు మంచి పట్టుచీరని బహుమతిగా ఇవ్వనుందా? తెలియాలంటే కింది లింకులో పూర్తి ఎపిసోడ్ ఉంది చూడగలరు.