Threatening calls to four mlas
mictv telugu

ఆ నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్..

November 13, 2022

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లను ఇప్పటికే సిట్ అధికారులు విచారించి కీలక సమాచారం రాబట్టారు. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ పోలీసులకు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మెయినాబాద్‌ సమీపంలోని ఓ ఫామ్‌ హౌజ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో మధ్యవర్తులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు చర్చలు జరిపారు. పార్టీ మారితే రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.