Threats to Uttar pradesh CM Yogi adithyanath
mictv telugu

సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను మూడ్రోజుల్లో చంపేస్తాం

August 9, 2022

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను మూడు రోజుల్లో చంపేస్తానంటూ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు దిగాడు. లక్నోలోని పోలీస్ కంట్రోల్ రూంలోని వాట్సాప్ హెల్ప్‌లైన్‌కి దుండగుడు వరుసగా మెసేజులు పెట్టడం సంచలనంగా మారింది. ఈ అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆగస్టు 2వ తేదీన ఈ బెదిరింపులు రాగా, ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కొద్ది రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగునుండగా, సీఎంకే బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫైర్ బ్రాండ్ నేతగా రాజకీయాల్లో రాణిస్తున్న యోగీ ఆదిత్యనాథ్.. తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. యూపీ వంటి పెద్ద రాష్ట్రానికి వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సాధించారు. పలు సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచే యోగీకి గతంలోనూ అనేక బెదిరింపులు వచ్చాయి. తాజా పరిణామం నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.