క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్

September 27, 2020

Three arrested for cricket betting.

ఐపీఎల్ 2020 సీజన్ మొదలైంది. ఆటను క్యాష్ చేసుకోవడానికి బెట్టింగ్ రాయుళ్లు బయలుదేరారు. మొన్నటికి మొన్న విజయవాడ కేంద్రంగా ఓ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సదరు ముఠా బెజవాడలో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని అవతార్ అనే యాప్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి నిందితులను పట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు నిర్వహించారని పోలీసులు వెల్లడించారు. ఇదిలావుండగా తాజాగా ఖమ్మం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీకి చెందిన బెట్టింగ్ ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సుగళ అక్షయ లింగం ఆధ్వర్యంలో షేక్ ఆరిఫ్, జెల్లా అఖిల్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురూ ఐపీఎల్ బెట్టింగ్‌ను తమ ఫోన్‌పే, గూగుల్ పే ఖాతాల ద్వారా నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెట్టింగ్ కాశారు. 12 మందితో రూ.2,10,51 లావాదేవీలు నిర్వహించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు  ముగ్గురుని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.