Three children missing after falling into the pond in hyderabad
mictv telugu

హైదరాబాద్.. చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

November 19, 2022

నగరంలోని నానక్ రాంగూడలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు అందులో పడి మునిగి చనిపోయారు. గచ్చిబౌలిలోని టెలికాం నగర్ కాలనీకి చెందిన తొమ్మిది మంది విద్యార్ధులు నానక్ రాంగూడ్ గోల్ఫ్‌‌‌కోర్సు సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లారు. అందులో ముగ్గురు విద్యార్ధులు లోతు గమనించకుండా దిగడంతో ఈత రాక నీట మునిగి చనిపోయారు. తోటి విద్యార్ధులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి మృతదేహాలను వెలికి తీశారు. చనిపోయిన వారిని దీపక్, పవన్, షాబాజ్‌లుగా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పేరెంట్స్‌కి అప్పగించనున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు టెలికాం నగర్‌‌‌‌‌లో విషాదం అలుముకుంది.