three consecutive days of holidays from tomorrow in some places in telangana
mictv telugu

రేపటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు

September 8, 2022

గణేశ్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9న శుక్రవారం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం జీవో జారీచేసింది. హైదరారాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాల్లో సెలవు అమల్లో ఉంటుందని తెలిపింది. దీనికి బదులుగా నవంబర్ రెండో శనివారం(12 వ తేది) సెలవు రద్దు చేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేసింది. రేపు విద్యాసంస్థలతోపాటు , ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టుకు కూడా సెలవు ఉండనుంది. ఇక ఎల్లుండి.. రెండవ శనివారం, ఆ తర్వాతి రోజు ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

ఇక నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండునున్నాయి. 9వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్లే రూట్లలో ఇతర వాహనాలకు అనుమతి ఉండదు. నెక్లె్‌సరోడ్‌, ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్‌, ఖైరతాబాద్‌, ఎన్‌టీఆర్‌మార్గ్‌, ఐమాక్స్‌ రోడ్డులో 10వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. నిమజ్జనం సందర్భంగా పలు ప్రాంతాల నుంచి 8 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడపనున్నారు. ఇక ఆర్టీసీ బస్సులను కూడా ట్యాంక్ బండ్ వరకూ అనుమతించట్లేదు. మెహిదీపట్నం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మాసాబ్‌ట్యాంక్‌ వద్ద, కూకట్‌పల్లి వైపు నుంచి వచ్చే వాటిని వీవీ విగ్రహం వద్ద, సికింద్రాబాద్‌ నుంచి వచ్చే బస్సులను చిలకలగూడ క్రాస్‌రోడ్స్‌ వద్ద, ఉప్పల్‌ వైపు నుంచి వచ్చే బస్సులను రామంతాపూర్‌ టీవీ స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే బస్సులను గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్‌ వరకే అనుమతించనున్నారు.