బెంగళూరులో భారీగా డ్రగ్స్.. మొత్తం రూ. 3.30 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

బెంగళూరులో భారీగా డ్రగ్స్.. మొత్తం రూ. 3.30 కోట్లు

September 24, 2020

drgg

కన్నడ సినీ ఇండస్ట్రీని ఇప్పటికే డ్రగ్ కేసు సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురిపై ఆరోపణలు రావడంతో విచారణ కూడా  ఎదుర్కొంటున్నారు. ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో బెంగళూరులో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. వాహనాల పార్కింగ్‌ స్థలాల్లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీ మార్కెట్‌ ప్రాంతంలో ఇది జరిగింది. దాదాపు రూ. 3.30 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

రాజస్థాన్‌కు చెందిన సునీల్ కుమార్, రాజారామ్ బిష్ణోయ్ అనే వ్యక్తులు సిటీ మార్కెట్‌ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ అమ్ముతున్నారు. ఈ సమచారం తెలిసిన వెంటనే  పోలీసులు పక్కా ప్లాన్‌తో అరెస్టు చేశారు. వారి నుంచి  125 గ్రాముల హఫీం, 150 గ్రాముల బ్రౌన్‌షుగర్‌, 25 ఎల్‌ఎస్‌డీ స్టిక్‌ సీజ్ చేశారు. ఆ తర్వాత వారిని విచారించగా..  వేరే ప్రాంతంలో దాచి పెట్టిన భారీ డంప్‌ వివరాలు చెప్పారు. మొత్తం రూ.3.30 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరికి వీటిని చేరవేస్తున్నారో తెలుసుకునే పనిలో పడ్డారు. నగరంలో ఇలా బహిరంగగానే డ్రగ్స్ విక్రయించడం సంచలనం రేపుతోంది.