ఒడిషాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మంగళవారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని నువాపాడా జిల్లాలో జరిగింది.
జవాన్లు గస్తీ విధులు నిర్వహిస్తుండగా మావోయిస్టులు దాడి చేశారు. మృతి చెందిన వారు శిశుపాల్ సింగ్, శివలాల్, ధర్మేంద్ర సింగ్‌గా అధికారులు గుర్తించారు. శిశుపాల్ సింగ్ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్ కాగా, శివలాల్, ధర్మేంద్రసింగ్ స్వస్థలం హరియాణా అని అధికారులు తెలిపారు. శిశుపాల్ సింగ్, శివలాల్.. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండగా, ధర్మేంద్ర సింగ్ సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.కాగా, నిన్న మధ్యప్రదేశ్‌లో కాల్పులు మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోలు మృతి చెందారు. లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.