Three days holidays for Telangana Inter students
mictv telugu

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఒక్కరోజే సెలవా ..?

January 11, 2023

సంక్రాంతి పండగ వచ్చేసింది. మరో మూడు రోజుల్లో పండగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా జరుపుకోనున్నారు. బస్సులు, రైళ్లలో కుస్తీలు పడుతూ సొంతూళ్లకు ప్రజలు ప్రయాణమయ్యారు. విద్యార్థులు కూడా హాస్టల్స్ నుంచి ఇంటిని వెళ్లిపోతున్నారు. అయితే తెలంగాణ ఇంటర్ విద్యార్థులు మాత్రం ఊసురుమంటున్నారు. దీనికి కారణం సంక్రాంతికి పండగకు ఇంటర్ బోర్డు మూడు రోజులు సెలవులు ప్రకటించడమే..పండుగకు జనవరి 14 నుంచి 16 వరకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చింది.

ఆ మూడు రోజుల్లో కూడా జనవరి 14వ తేదీ రెండో శనివారం, 15 నాడు ఆదివారం పోతే, సెలవులు ఇచ్చింది.కేవలం ఒకే ఒక్క రోజు అని నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి హాస్టల్లో ఉండే విద్యార్థులకు కష్టంగా మారింది. ఇంటికి వెళ్లి వచ్చేసరికి ప్రయాణంలోనే సెలవులు ముగుస్తాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు సెలవులు పొడిగించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ (అకాడమిక్) వసుంధర దేవి గారికి ABVP రాష్ట్ర కార్యదర్శి కుమారి ఝాన్సీ నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. అటు ఏపీలో మాత్రం 12 నుంచి 18 తేదీ వరకు సెలవులు పొడిగించారు. ఈనెల 19న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని పేర్కొంది.