హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని శంషాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.
ప్రమాద ఘటన గురించి తెలియగానే అక్కడికి చేరుకున్న సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం వాటిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు మహారాష్ట్రకు చెందినవారిగా భావిస్తున్నారు. హయత్ నగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా, పెద్ద గోల్కొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.