Three killed in MMTS train collision near Hitech station Hydearabad
mictv telugu

హైటెక్‌ సిటీ సమీపంలో ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొని ముగ్గురి మృతి

July 26, 2022

హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. . హైటెక్ సిటీ- హఫీజ్ పేట్ ఎంఎంటీఎస్ రైలు మార్గంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను వ‌న‌ప‌ర్తికి చెందిన రాజ‌ప్ప‌, శ్రీను, కృష్ణ‌గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒక‌రి వ‌ద్ద మ‌ద్యం సీసాలు ఉన్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. మంగ‌ళ‌వారం రైల్వేస్టేష‌న్‌కు స‌మీపంలోని మూల‌మ‌లుపులో ప‌ట్టాలు దాటుతుండ‌గా.. ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీస్‌ను ఉస్మానియా ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు.