నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని రామాలయం వద్ద రథాన్ని భద్రపరుస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించింది. రథాన్ని రథశాలకు చేర్చుతుండగా కరెంట్ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో రాజాబోయిన యాదయ్య (42), పొగాకు మొనయ్య (43), మక్కపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి (20) ఉన్నారు.