నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

May 10, 2022

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, ఒకరు స్పాట్‌లోనే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స అందిస్తుండగా మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..”మృతులు కమ్మర్ పల్లి ఇందిరాకాలనీకి చెందిన వాసులుగా గుర్తించాం. కృష్ణ, రజిత అనే దంపతులకు రాగిని, శరణ్య ఇద్దరి పిల్లలు. నిన్న అర్ధరాత్రి పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టడింది. దాంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయపడ్డారు. దాంతో వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. తల్లిదండ్రులు కృష్ణ, రజితతోపాటు, పెద్దకూతురు రాగిని కూడా మృతి చెందింది”

ఇటీవలే కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, 9మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే, మరో ఘటన కమ్మర్ పల్లి మండలంలో చోటుచేసుకోవడంతో ప్రజలు, వాహనాదారులు భయాందోళనకు గురౌతున్నారు.