మన మందుబాబుల క్యూకు గిన్నిస్ రికార్డు.. 3 కి.మీకిపైగానే - MicTv.in - Telugu News
mictv telugu

మన మందుబాబుల క్యూకు గిన్నిస్ రికార్డు.. 3 కి.మీకిపైగానే

May 7, 2020

లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో లిక్కర్ షాపుల గేట్లు తెరుచుకున్నాయి. ఇన్ని రోజులు చుక్క దొరక్క చిక్కిపోయిన మందుబాబులు ఒక్కసారిగా షాపుల ముందు ఎగబడ్డారు. వందలాది మంది క్యూ లైన్లలో నిలబడి మద్యం బాటిళ్లు తీసుకెళ్లారు. ఇన్నాళ్లు కట్టడి చేయడం రికార్డు స్థాయిలో మందుబాబులు లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని కడలూరులోని ఓ వైన్స్ సరికొత్త రికార్డు సృష్టించింది.

కడలూరు వైన్ షాపు ఊహించని విధంగా ఏకంగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. అక్కడ ఏకంగా 3 కిలోమీటర్ల మేర మందుబాబులు లిక్కర్ కోసం నిలబడటమే కారణం. ప్రపంచంలో ఇంత వరకూ ఎక్కడ ఇంత పెద్ద క్యూ లైన్ లేదు. దీంతో మద్యం కోసం ఇంత పెద్ద క్యూ లైన్ ఉండటంతో దీనికి ఈ గుర్తింపు లభించింది. ఇంత మంది ఉన్నా ఓపికగా లైన్‌లో వేచ్చి ఉండి మద్యం ఎలా తీసుకెళ్లారా అని ఈ విషయం తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి లాక్‌డౌన్ తర్వాత మద్యం అమ్మకాలే కాదు.. క్యూ లైన్లు కూడా ఇప్పుడు రికార్డులు సృష్టిస్తున్నాయి.