భద్రాద్రి కొత్తగూడెం ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

భద్రాద్రి కొత్తగూడెం ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

September 24, 2020

nnmg

తెలంగాణా అడవుల్లో వరుస ఎన్‌కౌంటర్లు అలజడి రేపుతున్నాయి. బుధవారం రాత్రి మావోయిస్టులకు పోలీసులకు మధ్య మరోసారి కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఇందులో ఇద్దరు మహిళా దళ సభ్యులు ఉన్నారు. చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో రాత్రి 7 గంటల సమయంలో ఇది జరిగిందని ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. సంఘటన స్థలంలో వారి నుంచి  ఒక పిస్టల్, 8 ఎంఎం రైఫిల్, భారీగా పేలుడు సామాగ్రీని స్వాధీనం చేసుకున్నారు. 

కాల్పులు జరుగుతుండగా మరికొందరు సభ్యులు తప్పించుకున్నారని పోలీసులు వెల్లడించారు. వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ నెల 27 వరకు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు సమావేశం అవుతున్నారనే సమాచారం అందింది. దీంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అడవుల్లో  కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో కంటపడుతున్న వారిని ఏరివేస్తున్నారు. అనుమానస్పదంగా కనిపించిన వారిని తనిఖీలు చేసి పంపిస్తున్నారు.