నిరుద్యోగులకు ఈ మూడు నెలలు కీలకం: మ్యాన్‌పవర్ సర్వే - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు ఈ మూడు నెలలు కీలకం: మ్యాన్‌పవర్ సర్వే

March 22, 2022

htftd

భారతదేశంలో వచ్చే మూడు నెలలు నిరుద్యోగులకు చాలా కీలకమని, త్వరలోనే భారతదేశంలోని పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నాయని ‘మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్ సర్వే’ తెలిపింది. ఈ సందర్భంగా ఆ కంపెనీలు ఏవీ? ఏ నియమకాలు చేపట్టబోతున్నాయి? అనే వివరాలను వెల్లడించింది. మరి ఆలస్యం చేయకుండా ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా..

మ్యాన్‌పవర్ గ్రూప్ ఎండీ సందీప్ గులాటి మాట్లాడుతూ..” దాదాపు 3,090 కంపెనీలు ఉద్యోగ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. 38 శాతం కంపెనీలు రానున్న మూడు నెలల్లో కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏప్రిల్-జూన్ మధ్య పలు కంపెనీల ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇందులో 55 శాతం తగ్గి, 17 శాతం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అని.. 36 శాతం కంపెనీలు తెలిపాయి. మరో 38 శాతం కంపెనీలు కొత్తగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపాయి.

ఐటీ, సాంకేతిక రంగాల అండతో భారత్ ముందుకు సాగుతుంది. అంకుర సంస్థలకు కూడా భారత్ అనువైన దేశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో రూ.283.5 కోట్ల స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. దీంతో అర్హతగల యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి” అని ఆయన తెలిపారు.

మరోపక్క ప్రస్తుత ఉద్యోగాల్లో మహిళల వాటా ఆందోళకరంగానే ఉందని సర్వే తెలిపింది. అత్యధికంగా భారత్‌లో ఆ తర్వాత ఆస్ట్రేలియా, చైనాలో ఈ ఉద్యోగాలు రానున్నాయని సర్వే తెలిపింది.