Three more days of holidays for educational institutions in Telangana
mictv telugu

తెలంగాణలో మరో మూడ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు

July 13, 2022

Three more days of holidays for educational institutions in Telangana

తెలంగాణలో హైదరాబాదుతో పాటు జిల్లాల్లో కూడా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలకు ఇప్పటికే మూడు రోజులు సెలవులు ఇవ్వగా దానిని మరో మూడు రోజులకు పొడిగించింది.

మరో మూడు రోజులు వర్షాలు పడుతాయనే వాతావరణ శాఖ సూచనతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ వారం మొత్తం సెలవులు ఇచ్చినట్టయింది. తిరిగి సోమవారమే బడులు తెరుచుకుంటాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది. సెలవుల వల్ల విద్యార్ధులకు ఉపశమనం దొరికినట్టయింది. అలాగే ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అటు 11 ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Three more days of holidays for educational institutions in Telangana