Three more days of rain in Telangana
mictv telugu

అలర్ట్ : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

September 10, 2022

Three more days of rain in Telangana

తెలంగాణలో ఇప్పటికే మూడు రోజుల నుంచి వర్షాలు పడుతుండగా, మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో శని, ఆదివారాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు, సోమవారం భారీ వర్షం కురిస్తుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొన్నారు.

వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసగుతోందని, అది రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని వివరించారు. దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరలోని పశ్చిమ బంగాళాఖాతం తీరానికి చేరుతుందని తెలిపారు. ఏపీలోని తీరప్రాంత ప్రజలు, కోస్తా ప్రాంతం వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా, కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు నిండి పొంగుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా, గోదావరి నదులలో భారీ వరద నీరు వచ్చే అవకాశముందని, పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.