తల వెనుక సెల్ చార్జింగ్.. తల్లీ, ఇద్దరు పిల్లలు సజీవదహనం - MicTv.in - Telugu News
mictv telugu

తల వెనుక సెల్ చార్జింగ్.. తల్లీ, ఇద్దరు పిల్లలు సజీవదహనం

August 10, 2020

Three no more due to mobile phone blast at tamil nadu.

ఏ వస్తువును ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే మనకు మంచిది. అంతేగానీ.. రాత్రంతా కొందరు సెల్‌ఫోన్ చేత బట్టుకుని అదే పనిగా వీడియోలు, పోర్న్ చూస్తూ అలాగే నిద్రలోకి జారిపోతూ ఫోన్‌ను పక్కలోనే జారవిడిచి పడుకునిపోతారు. కొందరైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటారు. దీంతో అవి పేలిన ఘటనలు ఎన్నో సంభవించాయి. అయినా కొందరు తెలిసి తెలిసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా.. తమిళనాడులో రాత్రి ఛార్జింగ్‌కు పెట్టిన సెల్‌ఫోన్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లి సహా తన ఇద్దరు కుమారులు మృత్యువాత పడ్డారు. కరూర్ జిల్లాలో ముత్తులక్ష్మీ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రపోయింది. నిద్రపోయేముందు ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టింది. తెల్లారేలోపు ఛార్జింగ్ నిండుతుందని ఆమె భావించింది. కానీ, తెల్లారేలోపే తమ బతుకులు గుగ్గిపాలు అయిపోతాయని ఆమె ఊహించలేకపోయింది. వారు నిద్రలోకి జారుకున్నాక ప్రమాదవశాత్తు ఆ సెల్‌ఫోన్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇల్లంతా మంటలు వ్యాప్తి చెందడటంతో ముత్తులక్ష్మీతో పాటు ఆమె ఇద్దరు కుమారులు రంజిత్, దక్షిత్ చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుండగా.. ఢిల్లీకి స‌మీపంలోని నోయిడా సెక్టార్ -63లోని ఒక కర్మాగారంలో ఈరోజు(సోమవారం) ఉద‌యం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ  ఘ‌ట‌న‌లో ఒక సెక్యూరిటీ గార్డు అగ్నికి ఆహుతయ్యాడు.  బాల్‌పెన్ తయారీ కర్మాగారంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న వెంట‌నే 13 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశాయి. ఈ ఘటనలో సఫీపూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో నివసిస్తున్న 23 ఏళ్ల గార్డు సందీప్ కుమార్ సజీవ ద‌హ‌న‌మ‌య్యాడు. కాగా, ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.