Three nominations have been filed for the post of Congress president
mictv telugu

కాంగ్రెస్ అధ్యక్ష బరిలోకి మూడో వ్యక్తి.. ఖర్గే ఎన్నిక లాంఛనమే!

September 30, 2022

Three nominations have been filed for the post of Congress president

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఈ పదవికి తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌తో పాటు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేలు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే చివర్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

బరిలోకి మూడో వ్యక్తి ఎంటరయ్యాడు. జార్ఖండ్‌కు చెందిన మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి కూడా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరిరోజు కాగా, అక్టోబర్ 1న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు అక్టోబర్ 8, పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే అక్టోబర్ 17న పోలింగ్, అదే నెల 19న ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఖర్గేకే పార్టీ హైకమాండ్ మద్ధతుతో పాటు పార్టీ సీనియర్ నేతల మద్ధతుందని తెలుస్తోంది. నామినేషన్ల దాఖలు సమయంలో ఆయన వెంట అశోక్ గెహ్లాట్, దిగ్విజ్, ముకుల్ వాస్నిక్ సహా జీ 23 నేతలైన మనీష్ తివారీ, ఆనంద్ శర్మ వంటి వారున్నారు. దీంతో ఆయన గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటితో పాటు దళిత వ్యక్తి కావడంతో బీజేపీ చేస్తున్న వ్యూహాలకు విరుగుడుగా ఉంటుందనే నమ్మకాన్ని శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. అటు మాజీ భార్య ఉదంతం శశిథరూర్ గెలుపుకు అడ్డంకిగా మారే అవకాశముంది. ఇక మూడో అభ్యర్థి కేఎన్ త్రిపాఠి పాత్ర నామమాత్రమేనని విశ్లేషిస్తున్నారు.