మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మూడు రాష్ట్రాల అసెంబ్లీలో 60-60 సీట్లు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో సహా అనేక ప్రాంతీయ పార్టీల పోటీ చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుున్నాయి. మూడు రాష్ట్రాల్లో విజయం తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అట కాంగ్రెస్ కూడా తామే అధికారంలోకి వస్తామని భావిస్తోంది. నాగాలాండ్ ఎన్డీపీపీ, బీజేపీ కూటమి, త్రిపురలో బీజేపీ , మేఘాలయలో హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలీంగ్ జరిగింది. త్రిపురలో 87.76శాతంగా కాగా..మేఘాలయలో 85.27శాతం, నాగాలాండ్ లో 85.90శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
ఈసారి గిరిజన ఓటర్లపై ఎవరికి ఎక్కువ పట్టు ఉందో కూడా ఫలితం తేలనుంది. మేఘాలయ, నాగాలాండ్‌లో పరిస్థితి త్రిపుర కంటే కొద్దిగా భిన్నంగా ఉంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ఐదేళ్ల క్రితం మేఘాలయలో బీజేపీ రెండు సీట్లు గెలుచుకుంది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిటి) ప్రభుత్వంలో భాగమైన బిజెపి ఈసారి కూటమిని విచ్ఛిన్నం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. మరి ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. గతంలో కాంగ్రెస్‌కు 21 సీట్లు వచ్చాయి. ఈసారి ఊహించిన దానికంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మేఘాలయలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు.