ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా.. ఉలిక్కిపడిన పీసీబీ - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా.. ఉలిక్కిపడిన పీసీబీ

June 23, 2020

gngvcmv

దాయాది దేశం పాకిస్తాన్‌లో కరోనా విజృంభిస్తోంది. చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు కూడా వ్యాధిబారిన పడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ జట్టులోనూ ఈ వైరస్ కలకలం సృష్టించింది. ముగ్గురు ఆటగాళ్లకు వ్యాధి లక్షణాలను గుర్తించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది. దీంతో పీసీబీ ఉలిక్కిపడింది. వెంటనే ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించి ఆటగాళ్లను అలర్ట్ చేసింది. 

కీలక ఆటగాళ్లు హైదర్ అలీ, హరిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్‌‌లకు ఈ వ్యాధి సోకింది.  వీరెవరికీ లక్షణాలు లేకుండానే వ్యాధి బయటపడిందని అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజుల్లోఇంగ్లండ్ తో పర్యటనకు పాక్ కసరత్తు ప్రారంభించింది. దీంట్లో భాగంగా ముందు వీరికి టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఈ పరీక్షల్లో ముగ్గురికి వైరస్ సోకిందని తేలింది. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించి వారి సన్నిహితులను క్వారంటైన్ చేశారు. క్రికెటర్లకు కరోనా సోకడంతో అంతా ఉలిక్కిపడ్డారు.