three People died in a road accident at Medchal Hyderabad
mictv telugu

లారీని ఓవర్ టేక్ చేయబోయి.. మహిళ సహ ముగ్గురు మృతి

September 12, 2022

హైదరాబాద్ లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలో జరిగిన ప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ఒకరు మహిళ ఉన్నారు. మేడ్చల్ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే సమయంలోలారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణీస్తున్న మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ఘటన జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంటి నుంచి బయల్దేరిన వాళ్లు సురక్షితంగా చేరుకుంటారనుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.