ప్రియాంక కేసు..ఫిర్యాదు తీసుకోని పోలీసులపై వేటు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంక కేసు..ఫిర్యాదు తీసుకోని పోలీసులపై వేటు

December 1, 2019

police ..

ప్రియాంకారెడ్డి హత్య కేసులో మొదటి నుంచి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెల్సిందే. ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు స్పందించిన తీరును అంతా తప్పుబట్టారు. దీంతో ప్రియాంక హత్యకేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులుపై వేటు పడింది. ప్రియాంక మిస్సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదును ఆలస్యం చేశారంటూ… శంషాబాద్ ఎస్సై రవి కుమార్‌, హెడ్ కానిస్టేబుల్‌ వేణుగోపాల్ రెడ్డి, ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణను  ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. 

ప్రియాంక అదృశ్యం అయ్యారంటూ ఆమె తండ్రి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శంషాబార్ పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఎవరైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు.