హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు పబ్‌లు సీజ్.. మూడూ అక్కడివే.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు పబ్‌లు సీజ్.. మూడూ అక్కడివే..

September 14, 2021

హైదరాబాద్ పబ్బుల్లో అర్ధనగ్న నృత్యాలు, అశ్లీలతతో కూడిన అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరుతున్నాయి. వీకెండ్ పార్టీలు, బర్త్ డే సెలబ్రేషన్‌తో పాటు ఎలాంటి వేడుకలైనా స్పెషల్ ఆఫర్స్ పేరిట వ్యాపారవేత్తలు, సంపన్న కుటుంబాలలోని యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నారు నిర్వహకులు. క్లబ్ డ్యాన్స్‌లపై నిషేధం ఉన్పప్పటికీ పలు పబ్బుల్లో అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.సా ధారణంగా పబ్‌లలో రూమ్స్‌కి అనుమతులుడవు. కాని దానికి విరుద్ధంగా కొన్ని పబ్‌లలో రూమ్స్ ఏర్పాటు చేసి అమ్మాయిలతో క్లబ్ డ్యాన్స్‌లు, వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు పబ్‌లపై పోలీస్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. సోమాజిగూడలో కంట్రీ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్న క్లబ్ టాలీవుడ్, హై ఫై, పర్పుల్‌లను సీజ్ చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఈ పబ్‌లలో అనేక అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న మురళిపై పంజాగుట్ట పోలీసులు అనేక కేసులను ఇప్పటికే నమోదు చేశారు. అయినా కూడా తన తీరును మార్చుకోకుండా పోలీసులతో పాటు సమాజానికి కూడా తలనొప్పిగా మారిన మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, రెవెన్యూ అధికారులతో కలిసి పబ్‌లను సీజ్ చేశారు.

చాలా వరకు పబ్‌లలో నిబంధనలను అమలుచేయకుండా నిర్వహకులు నిబంధనలకు తూట్లు పొడుస్తుంటారు. ఈ మధ్య కాలంలో పదేళ్ల పాపను పబ్‌లోకి అనుమతించిన సంఘటన కలకలం రేపింది. ఇంతకుముందు బేగంపేటలోని లెస్బాన్ పబ్‌ ఆవరణలో డ్యాన్సర్ హరిణిపై జరిగిన దాడిలో పలు అక్రమాలు కూడా బయటపడ్డాయి. బయటికి తెలియనివి చాలా సంఘటనలు మరెన్నో ఉన్నాయి. కొన్ని పబ్‌లలో లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నాయని, పబ్ నిర్వహకులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఫిర్యాదులు కూడా గతంలో అందిన సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ పబ్‌లలో చెప్పేది ఒకటి,జరిగేది ఒకటి అనే చందాన ఉన్నవని స్పష్టమవుతోంది.