ముగ్గురు అక్కచెల్లెళ్ల రికార్డ్..ఒకేసారి ప్రసవం - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురు అక్కచెల్లెళ్ల రికార్డ్..ఒకేసారి ప్రసవం

July 16, 2020

Three sisters gave birth at a tim

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లులు ఒకే రోజున ప్రసవించారు.

నాలుగు గంటల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ఒకే హాస్పిటల్ లో ప్రసవించారు.

అదికూడా నార్మల్ డెలివరీ కావడం విశేషం.

వీరికి పురుడు పోసిన డాక్టర్ కూడా ఒక్కరే కావడం గమ్మతైన విషయం.

ఈ అరుదైన సంఘటన అమెరికాలోని ఒహియోలో రాష్ట్రంలో జరిగింది.

ఆస్లే హయ్నెస్, దనీషా హయ్నెస్, ఎరియల్ విలియమ్స్ ముగ్గురు అక్కా చెల్లెళ్లు.

వీరు ముగ్గురు ఒకేసారి గర్భంతో ఉండగా పురిటినొప్పులతో జులై 3న ఒహియో మ్యాన్స్‌ఫీల్డ్ హాస్పిటల్‌లో చేరారు. 

తొలుత సిజేరియన్ చేయించుకుని ఒకేరోజు డెలివరీ అవుదాం అనుకున్నారు. కానీ, కుదరలేదు. 

తరువాత ఒకేరోజు ముగ్గురికి నార్మల్ డెలివరీ అయింది. 

ఆస్లే హయ్నెస్ కు 2.7 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టింది. 

ఎరియల్ విలియమ్స్ కు 3.6 కిలోల బరువుతో పండంటి ఆడబిడ్డ పుట్టింది.

దనీషా హయ్నెస్ కూడా ఆడ శిశువు జన్మించింది.

ఈ ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.

ఇలా జరగడం 5 కోట్ల మందిలో ఒక కుటుంబంలోనే సాధ్యమవుతుందని డాక్టర్లు తెలిపారు. 

ఈ అరుదైన ఘటన తమ హాస్పిటల్ లో జరగటం సంతోషంగా ఉందన్నారు. 

ఈ ముగ్గురు బిడ్డల తండ్రులు కూడా ఒకేసారి తండ్రులు అయినందుకు మురిసిపోతున్నారు.