three-spoon-wine-is-far-better-in-reducing-weight
mictv telugu

బరువు తగ్గాలంటే…మూడు చెంచాల వైన్ చాలు.!!

January 7, 2023

three-spoon-wine-is-far-better-in-reducing-weight

వైన్ తాగేవాళ్లంతా తాగుబోతులు కాదు..తెలివైనవారు. ఎందుకో తెలుసా…వారు శరీర బరువును తగ్గించుకునేందుకు వైన్ తాగుతున్నారు. అవును నిజమే. వైన్ తాగితే శరీర బరువు తగ్గుతుందట. రెడ్ వైన్‎తోపాటు వెల్లుల్లి రసం తీసుకుంటే బరువును కరిగించేందుకు చాలాబాగా పనిచేస్తుంది. శరీర జీవక్రియ ప్రక్రియను పెంచడంతోపాటు…శరీరంలోపలి నుంచి శుభ్రపరిచి టాగ్జిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మీ రక్తనాళాల్లో ఉండే హానికరమైన కొవ్వును కరిగిస్తుంది. కేవలం మూడు టేబుల్ స్పూన్ల వైన్లతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లి, రెడ్ వైన్ :
కావాల్సిన పదార్థాలు
12వెల్లుల్లి రెబ్బలు
అర లీటర్ వైన్

తయారీ విధానం :
ఒకజార్‎లో అరలీటరు రెడ్ వైన్ నింపి అందులో 12 వెల్లుల్లి రెబ్బలను వేయాలి. రెండు వారాలపాటు ఎండలో ఉంచి…తర్వాత గాజు సీసాలో నిల్వ చేయాలి.

వెల్లుల్లి శరీర బరువును తగ్గిస్తుంది:
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీర బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, చాలా మంది బరువును తగ్గించుకునేందుకు ప్రతిరోజూ వెల్లుల్లిని తింటారని పేర్కొంది.

బరువు తగ్గడంలో వైన్ పాత్ర:
కొవ్వు పదార్థాలను కరిగించడంలో వైన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే హెర్బల్ కెమికల్ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడంతోపాటు బెల్లీ ఫ్యాట్‌ను కరిగిస్తుంది.

అధ్యయనం ప్రకారం:
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఇతరులతో పోలిస్తే ప్రతిరోజూ మూడు చెంచాల వైన్ తాగే వారిలో బెల్లి ఫ్యాట్ గణనీయంగా తగ్గినట్లు తెలిపింది.