కేజీఎఫ్‌ గనుల్లో దొంగలు.. ఊపిరాడక ముగ్గురి మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

కేజీఎఫ్‌ గనుల్లో దొంగలు.. ఊపిరాడక ముగ్గురి మృతి 

May 14, 2020

poo

కేజీఎఫ్ అనగానే మెజారిటీ జనాలకు కన్నడ సినిమా గుర్తుకు వస్తుంది. కానీ, కర్ణాటకలో కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్స్) పేరుతో గోల్డ్ మైన్స్ ఉన్నాయి. కేజీఎఫ్ సినిమా ఆ గోల్డ్ మైన్స్ నేపథ్యంలోనే తీశారు. తాజాగా ఆ గోల్డ్ మైన్స్ లో దొంగలు పడ్డారు. కానీ, లోపల ఊపిరాడక ముగ్గురు దొంగలు మరణించారు.

చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల్లో ఉన్న కేజీఎఫ్ గని ఈ ప్రమాదం జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఈ గని చాలా రోజులుగా వాడుకలో లేదు. దీంతో అదే ప్రాంతానికి చెందిన స్కంద (55), జోసెఫ్ (45) పాటు మరో ముగ్గురు ఆ గనిలో ముడి బంగారం ఉంటుందని బుధవారం సొరంగ మార్గం ద్వారా వెళ్లారు. ముందుగా స్కంద, జోసెఫ్ తాడు సాయంతో లోతైన బావిలోకి 100 అడుగులు దిగారు. ఆ తర్వాత మూడో వ్యక్తి లోపలికి దిగాడు. ఊపిరాడకపోవడంతో పైకి లాగాలంటూ ఆ వ్యక్తి పెద్దగా కేకలు వేయడంతో మిగిలిన ఇద్దరు అతడిని పైకి లాగారు. ఈ సంఘటనలో స్కంద, జోసెఫ్ తో సహా మరో వ్యక్తి అక్కడే ప్రాణాలు వదలగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. దొంగలు పెద్దగా కేకలు వేయడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.