ఏపీలో మూడు సార్లు ఉచిత రేషన్.. తేదీలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో మూడు సార్లు ఉచిత రేషన్.. తేదీలు ఇవే..

March 28, 2020

Three times free ration in AP .. Dates are the same

లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకు మూడుసార్లు ఉచిత రేషన్ సరుకులు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మార్చి 29 (ఆదివారం)న రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. రెండో విడతగా ఏప్రిల్‌ 15న బియ్యం, కేజీ కందిపప్పును పంపిణీ చేస్తామని, ఏప్రిల్‌ 29న మూడోసారి ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని జగన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆహారభద్రతా పథకంలో లేని కార్డులకూ రాష్ట్రం బియ్యం, కేజీ కందిపప్పు ఇవ్వనుంది. ఈమేరకు అదనపు ఖర్చును రాష్ట్రం భరించనుంది.

అలాగే ఏప్రిల్‌ 1న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా లబ్దిదారులు అందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్‌ 4వ తేదీన నిరుపేదలకు రూ.1,000 చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్లను డోర్ డెలివరీ చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే మూడు నెలలకు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీచేశారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. విశాఖపట్నంలో(4), విజయవాడలో(3), ప్రకాశం జిల్లాలో (3), గుంటూరులో(2), నెల్లూరులో(1), రాజమండ్రిలో(1), తిరుపతిలో(1), కర్నూలులో(1) చొప్పున మొత్తం 16 కేసులు నమోదు అయ్యాయి.