Three UK brothers are given a house instead of money in the lottery
mictv telugu

మార్కెట్లోకి కొత్త రకం ఆఫర్.. రూ. 3.70 కోట్ల ఇల్లు రూ. 280లకే

November 6, 2022

పైన మీరు చదివింది నిజమే. కోట్ల ఖరీదు చేసే ఇంటిని వందల రూపాయలకే ఇచ్చేశారు. అయితే దీని వెనుక ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి. యూకేలోని మెడ్ వే, కెంట్ ప్రాంతంలో ఓ విలాసవంతమైన మూడంతస్తుల భవనం ఉంది. దీని విలువ 3 కోట్ల 70 లక్షల రూపాయిలు. ఇందులో నాలుగు పెద్ద బెడ్రూంలు, పెద్ద కిచెన్, డైనింగ్ ఏరియా, లివింగ్ రూంలు విత్ ఫర్నిచర్ ఫిట్టింగులతో అలంకరించి ఉన్నాయి.

ఇంటిని అద్దెకు ఇస్తే నెలకు రూ. 1 లక్ష 50 వేలు రెంటు వస్తుంది. ఇంత ఖరీదు చేసే ఇంటిని డేనియల్, జాసన్, విల్ ట్విన్ ఫోర్ అనే ముగ్గురు సోదరులు కేవలం రూ. 280 లకే అమ్మేశారు. అయితే ఇంత తక్కువకు అమ్మి వీరేమైనా నష్టపోయారా? అంటే అదీ లేదు. వారి లాభం వారికి వచ్చింది. ఇందుకోసం వారు కొత్త టెక్నిక్ యూజ్ చేశారు. ఇంటిని అమ్మడం కోసం లాటరీ టిక్కెట్లను అమ్మారు. అంటే లాటరీలో సాధారణంగా నగదు బహుమతి ఇస్తుండగా, ఇక్కడ మాత్రం ఇల్లు వస్తుందన్నమాట. దీనికోసం మొత్తం 1,55,000 టిక్కెట్లను ఒక్కోటి రూ. 280 లకు అమ్మారు. ఒకవేళ అంత మొత్తంలో టిక్కెట్లు అమ్ముడుపోకపోతే అప్పటివరకు అమ్ముడుపోయిన టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 70 శాతం విజేతకు బహుమతిగా ఇస్తారు. అయితే ఈ ఉపాయం ఇప్పుడు వచ్చింది కాదంట. కరోనా లాక్ డౌన్ సమయంలో డబ్బులు లేకపోవడం వల్ల ఈ ఐడియా వచ్చిందట. దాన్ని ఆ ముగ్గురు సోదరులు ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ఏదేమైనా కొత్త రకం లాటరీని కనిపెట్టిన ఈ సోదరులను అక్కడి ప్రజలు అభినందిస్తున్నారు.