వింబుల్డ‌న్‌ మ్యాచ్‌లు ఫిక్స్‌...! - MicTv.in - Telugu News
mictv telugu

వింబుల్డ‌న్‌ మ్యాచ్‌లు ఫిక్స్‌…!

July 20, 2017

ఫిక్సింగ్ ..ఫిక్సింగ్.. ఫిక్సింగ్…ఏ ఆటలోనైనా ఇదే. కొన్ని బయటపడుతాయ్..మరికొన్ని ఎప్పటికీ బయటకు రావు.క్రికెట్ నే కాదు ఫిక్సింగ్ భూతం…చివరకు వింబుల్డన్ ని ఆవహించింది. వింబుల్డన్ టోర్నీలో మూడు మ్యాచ్ లు ఫిక్సయ్యాయన్న వార్తలు..అభిమానుల్ని షేక్ చేస్తున్నాయి.

వింబుల్డ‌న్ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఫిక్స్ అయినట్లు టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్ తెలిపింది. ఈ మూడు మ్యాచ్‌ల‌పై విచార‌ణ జ‌ర‌ప‌నుంది. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో రెండు, మెయిన్ డ్రాలో ఒక మ్యాచ్ ఫిక్స‌యిన‌ట్లు స‌మాచారం అందింద‌ని టీఐయూ చెప్పింది. అయితే ఈ మ్యాచ్‌లు ఏవి? ఇందులో ఏ ప్లేయ‌ర్స్ ఉన్నార‌న్న‌ది మాత్రం వెల్లడించలేదు.. మ్యాచ్ అలెర్ట్ పాల‌సీ ప్ర‌కారం ఈ మూడు మ్యాచ్‌ల ఫ‌లితాల‌ను టీఐయూ రివ్యూ చేయనుంది. అసాధార‌ణ బెట్టింగ్ ప్ర‌క్రియ కార‌ణంగా ఈ మూడు మ్యాచ్‌ల ఫ‌లితాలు తారుమార‌య్యాయ‌ని భావిస్తోంది.