కశ్మీర్‌ బాలుడి గుండెకోత..కాల్పులకు బలైన తాతను లేపుతూ… - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌ బాలుడి గుండెకోత..కాల్పులకు బలైన తాతను లేపుతూ…

July 1, 2020

three year old Boy Survives jammu and kashmir Terror Attack

అప్పటివరకు తనతో అల్లారుముద్దుగా ఆడుకున్న తాత ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ విషయం తెలియక మూడేళ్ళ మనవడు తన తాత మృతదేహన్ని తట్టి విలపిస్తునాడు. ఈ హృదయ విదారక సంఘటన జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో జరిగింది. 

ఈ రోజు ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో సదరు పిల్లవాడు, అతడి తాత అక్కడి నుంచి వెళ్తున్నారు. దురదృష్టవశాత్తు ఎదురుకాల్పుల్లో పిల్లాడి తాతకు రెండు బుల్లెట్లు తగిలాయి. దాంతో అతడు ఘటనా స్థలిలోనే కన్నుమూశాడు. ఏం జరిగిందో తెలియని ఆ పసివాడు.. తాత శరీరం నుంచి రక్తం రావడంతో భయపడ్డాడు. తాత మృతదేహం పక్కన కూర్చుని ఏడవడం ప్రారంభించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ చిన్నారిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాత  మృతదేహం పక్కన మనవడు విలపిస్తున్న ఆ ఫోటోలు నెటిజన్లను కదిలిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఎదురుకాల్పుల్లో వృద్ధుడితో పాటు ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాను మృతి చెందగా.. మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.