రైళ్లలో తోక తిప్పితే మూడేళ్ల జైలు.. - MicTv.in - Telugu News
mictv telugu

రైళ్లలో తోక తిప్పితే మూడేళ్ల జైలు..

September 24, 2018

రైళ్లలో ఆడవాళ్లను వేధించే ఆకతాయిల పని పట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో మహిళలపై  ఆసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల సంఖ్య ఎక్కువ కావడంతో వారిపై ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వారికి మూడేల్ల జైలు శిక్ష విధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం రైల్వే యాక్ట్ కింద చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది.

ఇప్పటివరకు ఇలాంటి కేసులను జీఆర్పీ పోలీసులు విచారించే వారు, ఆర్పీఎఫ్ ఈ కేసులను పట్టించుకునేది కాదు. దీంతో రైళ్లలో ఆడవారి పట్ల వేధింపుల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆ కేసులను ప్రభుత్వం ఆర్పీఎఫ్‌కు అప్పగిస్తోంది. ఇక నుంచి మహిళలపై వేధింపులు జరుగకుండా రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.Three years of jail sentence for the fatalities of women who travel by trainఅంతేకాదు లైడీస్ కంపార్ట్‌మెంట్లలో మగవాళ్లు ఎక్కితే వారికి ప్రస్తుతం రూ. 500 జరిమానా విధిస్తున్నారు. దాన్ని రూ.1000కి పెంచాలని ఆర్పీఎఫ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అలాగే ఈ టికెటింగ్ ద్వారా మోసాలకు పాల్పడినవారిని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి మూడేళ్ల జైలుశిక్షతో పాటు.. రూ.2లక్షలు జరిమానా విధించాలని ప్రతిపాదించారు.

రైళ్లలో ప్రయాణించే ఆడవారిపై జరిగే అఘాయిత్యాలపై రాజ్యసభలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రస్తావన తీసుకొచ్చింది. 2014-16 మధ్య కాలంలో మహిళా ప్రయాణికులపై జరిగిన లైంగిక దాడులకు సంబంధించి మొత్తం 1607 కేసులు నమోదైనట్లు తెలిపింది. 2014 లో 448 కేసులు నమోదు కాగా.. 2015లో 553, 2016లో 606 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. దీంతో త్వరలోనే కేంద్ర నుంచి దీనికి అంగీకారం రానుంది.