గుంటూరు : ఇడ్లీ ఇస్తే తినలేదని బిచ్చగాడి హత్య.. అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరు : ఇడ్లీ ఇస్తే తినలేదని బిచ్చగాడి హత్య.. అరెస్ట్

May 6, 2022

గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇడ్లీ ఇస్తే తినకుండా విసిరేశాడని మద్యం మత్తులో ఉన్న ముగ్గురు స్నేహితులు బిచ్చగాడిని హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్ బోర్డ కాలనీలో ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూంటాడు. మే 1వ తేదీన అర్ధరాత్రి మహేశ్ అనే వ్యక్తి మద్యం మత్తులో బిక్షగాడికి ఇడ్లీ ఇస్తూ ‘చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుడిలా కనిపిస్తున్నావు. పోలీసులతో జాగ్రత్తగా ఉండు’ అని వెటకారంగా మాట్లాడాడు. దాంతో బాధపడిన బిచ్చగాడు ఇడ్లీని దూరంగా విసిరేశాడు. దాంతో కోపోద్రిక్తుడైన మహేశ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి బిచ్చగాడిని టూవీలర్‌పై ఎక్కించుకున్నారు. అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డులోకి తీసుకెళ్లి బిచ్చగాడిని విచక్షణారహితంగా కొట్టారు. దెబ్బలకు బిచ్చగాడు చనిపోవడంతో ముగ్గురూ అక్కడ్నుంచి పరారయ్యారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించి ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.