Three youths die in a train accident in Uttar Pradesh
mictv telugu

ఇయర్ ఫోన్స్‌తో పట్టాలపైకి.. దెబ్బకి ముగ్గురు ఔట్

August 20, 2022

కనీసం కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు యువకులు. అది వారి అమాయకత్వం అనుకోవాలా లేక కావాలని చేస్తున్నారో ఒక్కోసారి అర్ధం కాదు. రైలు పట్టాలపైకి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని ఒకరు చెప్పాలా. ఇయర్ ఫోన్స్‌తో చెవులు మూసుకుంటే రైలు శబ్దం వినపడదనే విషయం తెలియదా. ఈ సంఘటనను చూస్తే పై అనుమానాలు రాకమానవు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన రెండు వేర్వేరు రైలు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు ఇలాగే చనిపోయారు.

వివరాల్లోకెళితే.. కృష్ణ అతడి స్నేహితుడు మోను లంచ్ అనంతరం సమీపంలోని భదోహి రైల్వే స్టేషనుకి సమీపంలోని పట్టాలపై వాకింగ్‌కు వెళ్లారు. ఇద్దరు కూడా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంతో ఆ సమయంలో హౌరా – లాల్కువాన్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొచ్చింది. వేగంగా ఢీకొట్టడంతో వారిద్దరు ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. ఎంతసేపైనా రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా రైలు పట్టాల పక్కన వారి శవాలు కనిపించాయి. మరో ఘటనలో అహీంపూర్ స్టేషన్ హాల్ట్ వద్ద పంకజ్ దూబే అనే 30 ఏళ్ల వ్యక్తి వారణాసి – అలహాబాద్ లైను పట్టాలపై నడుస్తుండగా, ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. పై రెండు ఘటనల్లో మృతులు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల రైలు శబ్దం వినిపించలేదని, ఈ విషయంలో ప్రజలు నిర్లక్ష్యం వీడి అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.