కర్నూలు జిల్లా కేంద్రంలోని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దురుసుగా ప్రవర్తిస్తూ, ఆఫీస్లో ఉన్న వారిని బలవంతంగా బయటికి పంపేశారు. అనంతరం ఫర్నీచర్ బయటపడేసి కార్యాలయానికి తాళం వేశారు. అంతకు రెండ్రోజుల ముందు ఆ ఇంటి యజమాని పార్టీ ఆఫీసును ఖాళీ చేయాలని చెప్పారు. అయితే ఐదేళ్లు రెంట్ అగ్రిమెంట్ రాసుకున్నామని, ఒప్పందం ప్రకారం ఆఫీసు అద్దె కూడా చెల్లిస్తున్నామని జనసేన నేతలు చెబుతున్నారు. కాగా, కక్షపూరితంగా జనసేన ఆఫీస్ ఖాళీ చేయించేందుకు వైసీపీ నేతలే ఇదంతా చేశారని జనసేన నేత సురేష్ ఆరోపించారు.