Thugs snatched a bag from a person in Uttar Pradesh and ran away
mictv telugu

సంచిలో డబ్బుందని చోరీ.. బాధితుడు చెప్పింది విని పోలీసుల షాక్

July 13, 2022

ఉత్తరప్రదేశ్‌లో అత్యాశ సంఘటన చోటుచేసుకుంది. సంచిలో డబ్బుందనుకొని ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిని అడ్డగించారు. అందులో డబ్బు లేదు మొర్రో అని అంటున్నా వినకుండా అతడిని కొట్టి సంచీని లాక్కెళ్లారు. దాంతో పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసిన బాధితుడు.. సంచీలో ఏముందో చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లో వెళితే.. ఝాన్సీ జిల్లా ఉన్నావ్ గేట్ సమీపంలో నివసించే రవి అనే వ్యక్తి బైకుపై సంచీ పట్టుకొని రాత్రి పూట వెళ్తున్నాడు. అతని సంచీలో నగదు ఉంటుందనుకొని అటకాయించారు. సంచీ ఇవ్వమని బెదిరించగా, అందులో ఎలాంటి డబ్బు లేదని చెప్పినా వినకుండా రవిని కొట్టి సంచీ లాక్కుని పరారయ్యారు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషనుకి వెళ్లి దుండగులపై ఫిర్యాదు చేశాడు. సంచీలో తాను పెంచుకుంటున్న చిన్న కుక్క పిల్ల ఉందని, దానికి అనారోగ్యం చేస్తే వైద్యం చేయించేందుకు హాస్పిటల్‌కు వెళ్తున్నానని పేర్కొన్నాడు. తనకు ఎలాగైనా కుక్కపిల్లను అప్పగించాలని పోలీసులను వేడుకున్నాుడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలించి చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించారు. వెంటనే కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలిస్తున్నారు.