విశాఖ జాలర్లకు ఎంత కష్టం.. నడిసముద్రంలో బోటుపై పిడుగు... - MicTv.in - Telugu News
mictv telugu

 విశాఖ జాలర్లకు ఎంత కష్టం.. నడిసముద్రంలో బోటుపై పిడుగు…

October 18, 2019

boat .

వర్షాలతోపాటు పిడుగులు కూడా బీభత్స సృష్టిస్తున్నాయి. మనుషులు, పశువుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా విశాఖ సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుపై పిడుగు పడింది. దీంతో ఒక జాలరి  గల్లంతు కాగా.. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విశాఖలోని పెదజాలారిపేటకు చెందిన తెడ్డు వెంకన్న (40), పిల్లా జగ్గారావు (25), అరిసిల్లి పోలిరాజు (19), పిల్లా సతీష్‌ (24), వాడమొదుల లక్ష్మణ (30), పిల్లా పరశురాం (20) ఆరుగురు మత్స్యకారులు కలిసి గురువారం ఫైబర్‌ బోటుపై చేపల వేటకు వెళ్లారు. 

విశాఖ తూర్పు దిశగా 20 కిలోమీటర్ల దూరంలో నడి సముద్రంలోకి వెళ్లారు. ఇంతలో బోరున వర్షం మొదలైంది. దీంతో వారు వెనక్కు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో ఆకాశంలో ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా బోటుపై పిడుగు పడింది. ఊహించన పరిణామంతో పోలిరాజు సముద్రంలో పడిపోయాడు. మిగిలిన మత్స్యకారులు గాయపడ్డారు. మధ్యాహ్నం వీరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన సతీష్‌ను ఏఎన్‌ బీచ్‌ ఆస్పత్రికి తరలించారు.