Thundershowers during the next three days in Telangana, says Hyderabad meteorological department
mictv telugu

రాగల మూడు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు

June 7, 2022

Thundershowers during the next three days in Telangana, says Hyderabad meteorological department

గత కొన్నిరోజులుగా వేసవి తాపాన్ని భరిస్తున్న ప్రజలకు కొంత ఉపశమనం కలగనుంది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు ఉపరితల ద్రోణి తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి.. విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు.. సగటు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తున ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు.