సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు నటించిన రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రాలు ఒకే పండుగకు విడుదలవుతుండడంతో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. బాలయ్య చిత్రం జనవరి 12న, చిరంజీవి చిత్రం జనవరి 13న విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు రేట్ల పెంపుపై రిక్వెస్ట్ చేసింది. ఏపీలో రెండు చిత్రాలకు గరిష్టంగా రూ. 70 పెంచాలని కోరగా, రూ. 45 (జీఎస్టీ అదనం) అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసినట్టు సమాచారం. అటు తెలంగాణలో స్పెషల్ షోకి అనుమతి లభించింది. అంటే విడుదల రోజు ఉదయం 4 గంటలకు ఎంపిక చేసిన థియేటర్లలో ఈ చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. కాగా, ఈ రెండు చిత్రాలలో శ్రుతీహాసన్ హీరోయిన్ కావడం విశేషం. చిరంజీవి చిత్రానికి దేవీశ్రీప్రసాద్, బాలయ్య చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు.