Home > Featured > సాహోకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. 

సాహోకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. 

Prabhas’ Saaho ...

ఈ నెలాఖరుకు విడుదలకు సిద్ధమవుతున్న సాహో సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా బెనిఫిట్ షోస్‌తో పాటు టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు సినిమా నిర్మాతలు విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు అనుమతి దొరికినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదని సమాచారం.

‘బాహుబలి 2’ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సినిమాకు కూడా బెనిఫిట్ షోస్‌తో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదని స్పష్టంచేసింది. ఒక్క సినిమాకు టిక్కెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలకు తెలిపింది. ఏపీ ప్రభుత్వం మాత్రం సాహో సినిమా విడుదలైన తర్వాత మొదటి రెండు వారాలపాటు ధియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. దీంతో రూ.100 టికెట్ రూ.200కు పెరగనుంది.

బాహుబలి సినిమాకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది. కాగా, ‘బాహుబలి 2’ సినిమాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తర్వాత ఏ సినిమాకు కూడా అటువంటి అవకాశం ఇవ్వలేదు.

Updated : 25 Aug 2019 8:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top