Tie rakhis for KCR's film: KTR
mictv telugu

కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టండి: కేటీఆర్

August 12, 2022

తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ చిత్రపటానికి ఆడబిడ్డలంతా రాఖీలు కట్టాలని పిలుపునిచ్చారు. రాఖీ పండుగను పురస్కరించుకొని 33 జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ పథకాల మహిళా లబ్దిదారులతో గురువారం సాయంత్రం ఆయన జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి సాధ్యమనే విషయాన్ని తెలంగాణ సర్కార్ నమ్ముతుందని ఆయన పేర్కొన్నారు.

”మహిళల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ.200 ఉన్న పింఛను.. కేసీఆర్ పెద్ద మనసుతో పదిరెట్లు పెంచారు. 14 లక్షల మంది ఒంటరి, వితంతు మహిళలతోపాటు 4 లక్షలమంది మహిళా బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నాడు. ఈ ఆగస్టు 15 నుంచి అర్హులైన మరో 10 లక్షలమంది కొత్తవారికి రూ.2,016 చొప్పున పెన్షన్లు ఇవ్వబోతున్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సరైన అవకాశాలు దక్కేలా, వారి ఆత్మస్టెర్యం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అన్నలాంటి అండ..తల్లిలాంటి రక్షణ అమ్మఒడి పథకంలో భాగంగా గర్భిణుల కోసం ప్రత్యేకంగా 300 అంబులెన్స్‌ను ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ఇప్పటివరకు 10 లక్షల 85 వేల మంది గర్భిణులకు ప్రయోజనం కలిగింది” అని కేటీఆర్ అన్నారు.