కరోనాపై వెబ్‌సైట్.. అవగాహన, వదంతుల కట్టడికి  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాపై వెబ్‌సైట్.. అవగాహన, వదంతుల కట్టడికి 

April 5, 2020

TIFR, IISc launch website for credible content on the virus

కరోనా నివారణకు మందులు తయారవడానికి సమయం పట్టొచ్చునేమో.. కానీ, దానిని గుర్తించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతోంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా, యాప్ ద్వారా ఇతరులకు కరోనా ఉంటే గుర్తించేవిధంగా కనుగొన్నారు. తాజాగా కరోనాపై అవగాహన, వదంతుల కట్టడికి టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌) కేంద్రం ‘కొవిడ్‌ జ్ఞాన్‌’ పేరిట ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు  హైదరాబాద్ కేంద్రం అధికారులు శనివారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వందలాది శాస్త్రవేత్తలను ఈ వెబ్‌సైట్ ఒక్కతాటిపైకి తీసుకొస్తుంది. 

కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంచింది. ఈ ప్రక్రియలో టీఐఎఫ్‌ఆర్‌తోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టాటా మెమోరియల్‌ సెంటర్లు భాగం కానున్నాయి. టీఎఫ్ఆర్-హైదరాబాద్ డైరెక్టర్ వి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను ప్రభావితం చేస్తోందని.. ఈ క్రమంలో అనేక లక్ష్యాలను చేరుకోవడానికి శాస్త్రీయ సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.