సింగరేణి గనుల్లో పెద్దపులి సంచారం...వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

సింగరేణి గనుల్లో పెద్దపులి సంచారం…వీడియో

May 20, 2020

Tiger

హైదరాబాద్ లోని శంషాబాద్‌ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్న సంగతి తెల్సిందే. ఈ పులి ఆచూకీ లభించకముందే సింగరేణి గనుల్లో మరో పులి కార్మికులను భయపెడుతోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలం ఖైరి గూడ ఓపెన్ కాస్ట్ సమీపంలోని వాగులో నీరు తాగడానికి వచ్చిన పెద్దపులిని సింగరేణి కార్మికులు గమనించారు. 

తిర్యాని మండలంలో విస్తారంగా అటవీ ప్రాతం ఉండడంతో తరచూ పెద్దపులి గ్రామ శివారులోకి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అది ఇప్పుడు ఖైరిగూడ ఓపెన్ కాస్టులో తిరుగుతుండడంతో కార్మికులు విధులకు హాజరు కావడానికి భయపడుతున్నారు. అటవీ అధికారులు స్పందించి పులి నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఈ పులికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Publiée par Satyavathi Satya sur Mercredi 20 mai 2020