తెలంగాణ పల్లెల్లో చిరుత పులులు, పెద్ద పులులు కలకలం రేపుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఓ పెద్దపులి పశువుల కాపరిని చంపేసింది. దహేగాం మండలంలోని దిగెడ గ్రామ శివార్లలో పశువులు మేపుతున్న గణేశ్ అనే యువకుడిపై పెద్దపులి పంజావిసిరింది. పక్కనే ఉన్న మరో యువకుడు పారిపోయి గ్రామస్తులకు విషయం చెప్పాయి. అయితే మృగం అప్పటికే గణేశ్‌ను అడవిలోకి లాక్కుపోయింది.
గ్రామస్తులు కర్రలతో అడవిలోకి వెళ్లగా వారిని గణేశ్‌ను వదిలి పారిపోయింది. అతడు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు, అటవీశాఖ అధికారులు దిగెడ గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి వచ్చి పులే చంపేసిందని అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో గత ఏడాది పదిమందికిపైగా పులల వాతనపడ్డారు.