షాకింగ్.. ట్రాక్టర్‌పై దూకి రైతులపై పెద్దపులి దాడి (వీడియో)
పెద్దపులి పెద్దపులే అని నిరూపించుకుంది. ఏ మాత్రం భయపకుండా ట్రాక్టర్ పైకి దూకి రైతులపై దాడి చేసింది. ముగ్గురిపై పంజావిసిరింది. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లాలో ఈ భీతావహం చోటుచేసుకుంది. రాంబహదూర్, ఉజగర్ సింగ్, లాల్తా ప్రసాద్ అనే రైతులు తమ పొలంలోని ధాన్యాన్ని తీసుకురాడానికి ట్రాక్టర్ పై వెళ్లారు.
#WATCH A tiger attacks farmers, who were on a tractor, at a village in the Pilibhit district. Three people were injured in the attack. (01.05.20) pic.twitter.com/YaPgm0YfVC
— ANI UP (@ANINewsUP) May 1, 2020
లాక్ డౌన్ వల్ల మనుషుల అలికిడి తక్కువగా ఉండడంతో పొలం వద్ద తచ్చాడుతున్న పులి వారిని చూసి పొదల్లో దాక్కుంది. తర్వాత ఒక్క ఉదుటున ట్రాక్టర్ పైకి దూకింది. రైతులు కూడా దీటుగా కర్రలతో దానిపై దాడి చేశారు. అయినా పులి భయపడకుండా పంజా విసిరింది. రాంబహదూర్ విసిరి కర్రను నోటితో కరిచిపచ్చుకోవడంతో అది కాస్తా విరిగింది. దాంతో పులి కిందపడి తోకముడిచి పారిపోయింది. గాయపడిన రైతులను ఆస్పత్రులకు తరలించారు. దగ్గర్లోనే ఉన్న వ్యక్తులు దాడిని వీడియో తీశారు. లాక్ డౌన్ నుంచి వ్యవసాయ పనులకు మినహాయింపు ఇవ్వడం తెలిసిందే.