సున్నిత హృదయులు ఈ వార్తను దయచేసి చదవొద్దు... - MicTv.in - Telugu News
mictv telugu

సున్నిత హృదయులు ఈ వార్తను దయచేసి చదవొద్దు…

July 5, 2017

కొన్ని వార్తలు మనస్సను కదిస్తాయి. ఇంకొన్ని వార్తలు ఎందుకు చదివానా అన్పించేలా ఉంటాయి. మరి కొన్ని వార్తలైతే ఎవర్నీ తప్పు పట్టాలో తెలియదు.  ఈ నడ్మ వస్తున్నా చాలా వార్తలు ఇలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తున్నాయి. సిన్మాల్లో కూడా జరగని ఘటనలు మనుష్యుల మధ్య జరుగుతున్నాయి. మనిషి… మానత్వం అన్నీ కూడా అవసరాలు… ఆకలి ముందు తల వంచుతున్నాయి. సరిగ్గా  ఇలాంటి ఘటనే ఫిలిబిత్ లోని టైగర్ రిజర్వులో జరిగింది.

ప్రభుత్వం నుండి వచ్చే పరిహారం కోసం ఇండ్లల్లో ఉన్న వృద్ధులను ఫారెస్టు లోని పులలకు ఆహారంగా వేస్తున్నారట. మాములుగా చనిపోతే పరిహారం రాదని వృద్ధులను వాటికి ఆహారంగా వేస్తున్నారట. పులల దాడిలో చనిపోయిన వారి మృతదేహాలను తమ పొలాల్లో వేసుకుంటున్నారట అక్కడి వారు.  ఈ యేడాది ఫిబ్రవరి 16 నుండి మలా అటవీ ప్రాంతంలో ఏడుగురు వృద్దులు పులల దాడిలో చనిపోయారట.  ఈ విషయంపై వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రతినిధి కలీమ్ విచారణ చేపట్టారు. విచారణలో దిమ్మదిరిగే  నిజాలు తెలిశాయట. తమ ఇండ్లల్లో ఉండే  వృద్ధులు కావాలనే పులలకు ఆహారంగా మారుతున్నారని చెప్పారట. పేదరికంలో జీవించే కంటే పులలకు ఆహారంగా మారితే వాటి ఆకలి తీరుంది…. కుటుంబానికి  ఆర్థిక  సాయమూ అందుతుందనే ఉద్దేశ్యంతో ఇట్లా చేస్తున్నారట.

నేరం నాది కాదు ఆకలిది.  ఇది సిన్మా పేరులా ఉన్నా… ఇక్కడిది నిజం.  అంతకేంటే కూడా  మానత్వం మరిచి మరీ ఇంత ఆటవీకంగా… ఆనాగరింకగా ఎట్లా చేస్తున్నారో…. దారుణానికి ఖచ్చితంగా ఇది పరాకాష్ట.