సర్కస్ నుంచి తప్పించుకున్న పెద్దపులి.. - MicTv.in - Telugu News
mictv telugu

సర్కస్ నుంచి తప్పించుకున్న పెద్దపులి..

November 25, 2017

ఫ్యాషన్ ప్రపంచ రాజధాని పారిస్ మహానగరంలో శనివారం ఓ పెద్దపులి ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. బోర్మాన్ మోరెనో సర్కర్  నుంచి తప్పించుని ఈఫిల్ టవర్ చుట్టుపక్కల వీధుల్లో కలకలకం రేపింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగారు. దానికి మత్తు మందు ఇవ్వడానికి, ఒకవేళ దాడి చేస్తే కాల్చి చంపడానికి సిద్ధమయ్యారు. అయితే అంతలోనే దాని యజమాని అక్కడికి చేరుకుని ఆ పులిని తుపాకీతో కాల్చిచంపాడు. పులి ఎవరిపైనా దాడి చేయలేదని, దాన్ని చంపిన యజమానిపై కేసు పెట్టామని పోలీసులు తెలిపారు.